Russia COVID-19 death : రష్యాలో కరోనా భీభత్సం.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి మరణాలు..!

Russia's COVID-19 death : కరోనా వైరస్ రష్యాలో మళ్ళీ భీభత్సం సృష్టిస్తోంది.. అక్కడ మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 973మంది మృతి చెందినట్టుగా అధికారులు వెల్లడించారు. రష్యాలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక గడిచిన 24గంటల్లో అక్కడ 28,190 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 7.8 మిలియన్లకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 2,18,345 మంది కరోనాతో ఇప్పటివరకు మృతి చెందారు. యూరప్‌లో అత్యధిక కొవిడ్ మరణాలు రష్యాలోనే సంభవించడం గమనార్హం.
అయితే ఇన్ని మరణాలు అక్కడ సంభవించడానికి గల కారణం అక్కడ టీకా పంపిణీ మందకొడిగా సాగడమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 14.6కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు 33శాతం మంది ఫస్ట్ డోస్, 29శాతం సెకండ్ డోస్ వేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com