Joe Biden : ప్రిగోజెన్ పై విష ప్రయోగం జరగొచ్చు

Joe Biden : ప్రిగోజెన్ పై విష ప్రయోగం జరగొచ్చు
నేనే ప్రిగోజెన్ అయితే ఏమి తిన్నా జాగ్ర‌త్త‌గా ఉంటానన్న బైడెన్‌

ఒక‌వేళ తానే ప్రిగోజిన్ అయితే, అప్పుడు తినే ఆహారం పట్ల తాను జాగ్ర‌త్త‌గా ఉండేవాడిన‌న్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ భవిష్యత్​పై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ప్రిగోజిన్​కు భవిష్యత్​లో ముప్పు ఉందని, ఆయనపై ఏ క్షణమైనా విష ప్రయోగం జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు వ్య‌తిరేకంగా వాగ్న‌ర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ సైనిక తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. దానిలో భాగంగా రొస్తోవ్‌-ఆన్‌-డాన్‌ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని వాగ్న‌ర్ గ్రూపు ఆధీనంలోకి తీసుకుంది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే తరువాత బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కలుగజేసుకోవడంతో తిరుగుబాటు ముగిసింది. ప్రిగోజన్ వెన‌క్కి త‌గ్గాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ప్రిగోజిన్ ఆచూకీ లేదు. రోస్తోవ్ న‌గ‌రాన్ని జూన్ 24వ తేదీన ప్రిగోజిన్ వీడాడు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డికి వెళ్లారో తెలియ‌దు. ప్రిగోజిన్ ఆచూకీ తెలియ‌ద‌ని, కానీ బ‌హుశా అత‌నికి విషం ఇచ్చి ఉంటార‌న్న ఉద్దేశ్యంలో ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ జోక్ వేశారు. గురువారం ఆయ‌న స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.



ఒక‌వేళ తానే ప్రిగోజిన్ అయితే, అప్పుడు భుజించే ఆహారం పట్ల తాను జాగ్ర‌త్త‌గా ఉండేవాడిన‌ని బైడెన్ అన్నారు. త‌న‌కు ఇచ్చే మెన ప‌ట్ల త‌న దృష్టిని నిలిపేవాడిన‌న్నారు. సరదా మాటలన్నీ పక్కన పెడితే.. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో అసలు ఎవరికీ కచ్చితంగా తెలీదని భావిస్తున్నానన్ని వైట్‌హౌజ్‌లో బైడెన్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. ఆ మధ్య పుతిన్‌ను ఎదిరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ సహా కొందరిపై విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బైడెన్ ఈ విధంగా స్పందించారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Tags

Next Story