Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకారం.. భీకర రూపం దాల్చిన యుద్ధం

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని ఏకంగా 84 మిసైళ్లతో ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు దిగింది. దీంతో జెలెన్‌స్కీ సర్కార్ యూరప్ దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
అయితే ఉక్రెయిన్ కోసం అమెరికా మరోసారి రంగంలోకి దిగింది. రష్యా మిసైల్స్‌ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. రష్యా క్షిపణి దాడుల క్రమంలో జెలెన్‌స్కీతో ఫోన్ లో మాట్లాడిన బైడైన్ హామీ ఇచ్చారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను కూడా అందిస్తామన్నారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.
రష్యా దాడితో ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తినష్టం జరిగింది. 11 మంది మరణించారు.. వందలమందిగాయపడ్డారు. మరోవైపు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా తో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని రష్యా ఆరోపించింది.
ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ UNO సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది.
ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్ డిమాండ్‌ను భారత్ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్‌కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com