Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటీ..

2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు.
‘‘ఈ రోజు ఉదయం బీజింగ్‌లో అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను నా సహ SCO విదేశాంగ మంత్రులతో కలిసి కలిశాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశాను. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అభివృద్ధి గురించి అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించాను. ’’ అని ట్వీట్ చేశారు.
జూన్ 2020లో జరిగిన ఘోరమైన గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది మొదటి సమావేశం. అక్టోబర్ 2024లో సరిహద్దుల్లో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చా విధానాలను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సోమవారం, జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కూడా భేటీ అయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com