Sabash Natasha: ప్రపంచ తెలివైన విద్యార్థిగా భారత సంతతి చిన్నారి..

Sabash Natasha: ప్రపంచ తెలివైన విద్యార్థిగా భారత సంతతి చిన్నారి..
2021-22కుగాను పలు ట్యాలెంట్ టెస్టులలో నటాషా అసాధారణమైన ప్రదర్శన


ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థుల జాబితాలో భారత సంతతికి చెందిన నటాషా పెరియనాయగం ఉన్నారు. అమెరికాకు చెందిన Johns Hopkins Center for Talented Youth (CTY) నిర్వహించిన ట్యాలెంట్ పరీక్షలో నటాషా బ్రైటెస్ట్ స్టుడెంట్ గా నిలిచింది. నటాషా, న్యూజెర్సీ లోని ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడిల్ స్కూల్లో చదువుతుంది.

వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో నటాషా ఉత్తమ ప్రతిభను కనబర్చినట్లు తెలిపారు స్కూల్ యాజమాన్యం. అందుకుగాను నటాషాను అభినందించారు. 2021-22కుగాను పలు ట్యాలెంట్ టెస్టులలో నటాషా అసాధారణమైన ప్రదర్శనను కనబర్చినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది విశ్వవిద్యాలయం. నటాషా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఖాళీ సమయాల్లో JRR టోల్కిన్ నవలలు చదవడం నటాషాకు చాలా ఇష్టమని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులను గుర్తించడానికి CTY ఉన్నతస్థాయి పరీక్షను నిర్వహిస్తుంది. యునివర్సిటీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2021-22 టాలెంట్ సెర్చె ఇయర్ లో CTY, 76దేశాల నుండి 15,300మంది విద్యార్థులను గుర్తించి ట్యాలెంట్ టెస్ట్ పెట్టింది. అందులో భారత సంతతికి చెందిన పెరియానగమమం బ్రైటెస్ట్ స్టుడెంట్ గా ఎన్నికైంది.

Tags

Read MoreRead Less
Next Story