Sahil Bhavnani: ఫారిన్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి.. వన్ సైడ్ లవ్‌స్టోరీ.. కట్ చేస్తే అబ్బాయికి జైలు శిక్ష..

Sahil Bhavnani (tv5news.in)
Sahil Bhavnani: ప్రస్తుతం ఇండియాలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫారిన్‌కు వెళ్లి చదవాలన్నా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తల్లిదండ్రులు కూడా ఫారిన్‌లో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో వారి కోరికను కాదనలేకపోతున్నారు. అలాగే సాహిల్ భవ్నానీ(22) భవిష్యత్తు బాగుండాలని వారి తల్లిదండ్రులు యూకేలో సెటిల్ అయ్యారు. ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో తనకు చదివే అవకాశం కూడా లభించింది. కానీ అక్కడ అతడు చేసిన నిర్వాకం తన కెరీర్‌నే రిస్క్‌లో పడేసింది.
సాహిల్ భవ్నానీ.. తనతో పాటు యూనివర్శిటీలో నర్సింగ్ చదువుతున్న ఓ ఫారిన్ విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం మొదలుపెట్టాడు. ఓసారి లవ్ చేస్తున్నానంటూ, పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుదామంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు. కానీ దానికి ఆ విద్యార్థిని ఒప్పుకోలేదు. సాహిల్‌ను పట్టించుకోవడం మానేసింది. అయినా అతడు ఊరుకోలేదు.
తన ప్రేమను వంద పేజీల లవ్ లెటర్ రూపంలో తనకు అందించాడు. దాంట్లో తన ప్రేమను ఒప్పుకోకపోతే వదిలేది లేదంటూ బెదిరించాడు కూడా. దీంతో సాహిల్ వల్ల తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడిన ఆ విద్యార్థిని ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టును ఆశ్రయించింది. గత కొన్ని నెలలుగా కోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టారు.
విచారణలో సాహిల్.. ఆ అమ్మాయి వెంటపడినట్టు, లవ్ లెటర్‌తో బెదిరించినట్టు ఒప్పుకోవడంతో తనుక శిక్షను తక్కువ చేశారు. సాహిల్‌కు కోర్టు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను విధించింది. విచారణలో ఆ వంద పేజీల లవ్ లెటర్ రాయడానికి సాహిల్ మూడు నెలలు కష్టపడ్డట్టుగా వెల్లడించాడు. ప్రస్తుతం ఆ యూనివర్సిటీలో ఈ ఘటనపై చర్చలు నడుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com