Salima Mazari : ఆఫ్ఘనిస్తాన్ తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు!

ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదటి మహిళా గవర్నర్‌లలో ఒకరైన సలీమా మజారిని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోవడంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో పాటుగా చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ నాయకులు దేశం విడిచిపారిపోయారు. కానీ బల్ఖ్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా సలీమా మజారి ఎదురొడ్డి పోరాడారు. కానీ చివరికి ఆమె జిల్లా చాహర్ కింట్ పై తాలిబాన్లు పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. అటు తాము మారిపోయమని ఇస్లామిక్ చట్టాల ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com