Saudi Arabia: బస్సు తగులబడి 42 మంది భారతీయులు మృతి..

సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని నిముషాల్లోనే మొత్తం బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ భయానక ప్రమాదంలో 42 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రయాణికులలో ఎక్కువ మంది మక్కాకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందినవారని ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత కారణంగా పలువురి శరీరాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. బాధితుల గుర్తింపు, గాయపడిన వారి వివరాల కోసం భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

