10 Jan 2022 7:27 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Advertisement: భార్య...

Advertisement: భార్య కోసం భారీ హోర్డింగ్.. క్యూ కడుతున్న యువతులు..

Advertisement: తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలియజేశాడు.

Advertisement: భార్య కోసం భారీ హోర్డింగ్.. క్యూ కడుతున్న యువతులు..
X

Advertisement: పెళ్లి చేసుకుందామంటే పిల్ల యాడ దొరకట్లేదంటూ వాపోతున్నాడు మహ్మద్ మాలిక్.. స్నేహితుడి సలహాతో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసి వీధి కూడలిలో పెట్టాడు.. పెద్దలు కుదిర్చే పెళ్లి నుంచి కాపాడండి అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న హోర్డింగ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.. నలుగురినీ ఆకర్షించాలంటే ఏదైనా వినూత్నంగా చేయాలి.

లండన్, బర్మింగ్ ‌హమ్ నగరాల్లో ఈ బిల్‌బోర్డ్ ప్రకటన ఏర్పాటు చేశాడు బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్థాన్ భారతీయుడు. సరదాగా చేశాడేమో అనుకున్నారు అంతా.. లేదండి సీరియస్‌గానే చెబుతున్నాను అని తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలియజేశాడు.

ఇప్పటి వరకు నాకు సరిజోడీ అయిన అమ్మాయి దొరకలేదు.. కాబోయే భార్యను వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంది. చాలా డేటింగ్ యాప్‌లలో ప్రయత్నించాను. తెలిసిన వారి ద్వారా సంబంధాలు కూడా చూశాం. కానీ ఒక్కరూ నచ్చలేదు.. అందుకే నా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఇలా ప్రయత్నిస్తు్న్నా అంటాడు మాలిక్. అయితే తన కష్టం ఊరికే పోలేదు.

ప్రకటనకు స్పందించి వందలాది మంది యువతులు మాలిక్‌ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.. మాలిక్ 'Findmalikawife.com' అనే వెబ్‌సైట్‌ను ఇందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసాడు. ప్రకటనకు వచ్చిన రెస్పాన్స్ చూసి మాలిక్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.. నాక్కాబోయే భార్య ఈసారి కచ్చితంగా దొరికేస్తుందని సంబరపడుతున్నాడు.

Next Story