అంటార్కిటికా మంచు కింద వింత జీవి.. !

అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచు ప్రదేశం అన్న సంగతి తెలిసిందే.. సూర్యకాంతి కూడా ప్రవేశించని ఈ ప్రదేశంలో జీవం జీవించడం అనేది అసాధ్యం.. అయితే అంటార్కిటికా మంచు పర్వతాల అడుగున, దాదాపు 3000 అడుగుల (900 మీటర్ల) లోతున జీవం ఉనికిని తొలిసారిగా బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బాస్) శాస్త్రవేత్తలు అంటార్కిటికాలోని ఓ దట్టమైన ఐస్ షీట్కు రంద్రం చేసి అందులోకి కెమెరాను పంపించి పరిశీలిస్తుండగా వారికి అడుగుభాగంలోకి పంపిన కెమెరాకు ఓ వింత జీవి కనిపించింది. స్పాంజ్ ఆకారంలో ఉన్న ఓ వింత జీవి అడుగుభాగంలో కనిపించింది. ఈ జీవిని చూసి శాస్త్రవేత్తలు ముందుగా షాక్ అయ్యారు. ఈ వింతైన జీవులు అలాంటి పరిస్థితుల్లో కూడా జీవించడం అరుదైన విషయం అని బ్రిటన్ శాస్త్రవేతలు అంటున్నారు. అయితే ఈ జీవుల ఏ జాతికి సంబంధించినవి, వాటి మనుగడ ఎలా ఉంటుందనే దానిపైన పరిశోధనలు చేస్తున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.
Accidental discovery of extreme life! Far underneath the ice shelves of the #Antarctic, there's more life than expected: https://t.co/atdkiv1GrA
— British Antarctic Survey (@BAS_News) February 15, 2021
BAS marine biologist Dr Huw Griffiths @griffiths_huw explains... pic.twitter.com/Z6OUw4oQNs
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com