Ukraine: రెండు రోజుల్లో రెండో మరణం.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్ధి..

Ukraine: రెండు రోజుల్లో రెండో మరణం.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్ధి..
Ukraine: రెండు రోజుల్లో ఉక్రెయిన్‌లో రెండవ భారతీయుడు మరణించాడు, పంజాబ్‌కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు..

Ukraine: రెండు రోజుల్లో ఉక్రెయిన్‌లో రెండవ భారతీయుడు మరణించాడు, పంజాబ్‌కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన వాళ్ల గురించి ఆందోళన ఎక్కువైంది స్వదేశంలో ఉంటున్న తల్లిదండ్రులకి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.

వైద్య విద్య చదువుతున్న విద్యార్థి చందన్ జిందాల్ (22) ఇస్కీమిక్ స్ట్రోక్‌తో ( ఇది సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులోని రక్తనాళాన్ని అడ్డుకోవడం వల్ల వస్తుంది. ఇది మెదడుకు రక్తం ప్రవహించకుండా చేస్తుంది. నిమిషాల వ్యవధిలో, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి) విన్నిట్సియా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేరాడు. కానీ డాక్టర్లు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో ఈరోజు జిందాల్ తుది శ్వాస విడిచారు.

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడితో యుద్ధం జరుగుతున్న తరుణంలో పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన భారతీయ విద్యార్థి బుధవారం మరణించాడు. చందన్ జిందాల్ (22) విన్నిట్సియా ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కొడుకు మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. కుమారుడి మృతదేహాన్ని త్వరితగతిన తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అతని తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఒక రోజు క్రితం ఖార్కివ్‌ షెల్లింగ్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతదేహాన్ని కూడా తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఒంటరిగా ఉన్న భారతీయుల తరలింపు కష్టంగా మారుతోంది. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇతర దేశాల ద్వారా డెడ్ బాడీలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story