అంతర్జాతీయం

అసలే ఓవర్ లోడ్.. ఆపై సెల్ఫీ.. ఏడుగురు ప్రాణాలు..

పరిమితికి మించి ప్రయాణీకులు పడవలో ఉన్నారు. అందరూ ఓ పక్కకు వచ్చి సెల్ఫీ తిగుతున్నారు.

అసలే ఓవర్ లోడ్.. ఆపై సెల్ఫీ.. ఏడుగురు ప్రాణాలు..
X

ఇండోనేషియా రాజధాని జకార్తా జావా ద్వీపంలోని రిజర్వాయర్‌లో పర్యాటకులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అసలే పరిమితికి మించి ప్రయాణీకులు పడవలో ఉన్నారు. అందరూ ఓ పక్కకు వచ్చి సెల్ఫీ తిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడటంతో ఏడుగురు ఇండోనేషియన్లు మునిగిపోయారు.

బోయోలాలి రీజెన్సీలో గ్రూప్ ఫోటో తీసుకోవడానికని మొత్తం 20 మంది ప్రయాణికులు హఠాత్తుగా బోటుకు ఒక వైపుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని సెంట్రల్ జావా పోలీసు చీఫ్ అహ్మద్ లుట్ఫీ తెలిపారు.

"ప్రమాదానికి కారణం అధిక సామర్థ్యం" అని మిస్టర్ లుట్ఫీ విలేకరులతో అన్నారు. "20 మంది కుడి వైపున సెల్ఫీ తీసుకున్నారు, అప్పుడు బోటు బ్యాలెన్స్ కోల్పోయి పల్టీలు కొట్టింది."

11 మందిని రక్షించినప్పటికీ ఏడుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా తప్పిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం రెస్క్యూ టీమ్ వెతుకుతోంది.

రిజర్వాయర్ వద్ద బోటు ప్రయాణాలను నిర్వహించే వారి నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

ఇండోనేషియాలో 17,000 ద్వీపాలు ఉన్నాయి. ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో బోటు ప్రమాదాలు సర్వసాధారణం. తరచు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

Next Story

RELATED STORIES