Mexico : కూలిన చర్చ్ పైకప్పు…ఏడుగురి మృతి

Mexico : కూలిన చర్చ్ పైకప్పు…ఏడుగురి మృతి
రోడ్డు ప్రమాదం.. 10మంది వలసవాదులు మృతి

మెక్సికో దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. జరిగింది. ఈశాన్య మెక్సికోలో తీరప్రాంత పట్టణమైన సియుడాడ్ మాడెరోలో ఆదివారం ప్రార్థన సమయంలో ప్రమాదం జరిగింది. చర్చి పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 10 మంది గాయపడ్డారని తమౌలిపాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.


పౌర రక్షణ దళాలు సహాయ చర్యలు చేపట్టాయని గవర్నర్ అమెరికా విల్లారియల్ చెప్పారు. శాంటా క్రజ్ పారిష్ శిథిలాల కింద 20 మంది ఉన్నారని, సీలింగ్ కూలిపోయినప్పుడు బాప్టిజం జరుపుకుంటున్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. కూలిన భవన శిథిలాల నుంచి దుమ్ము, ధూళి వెలువడుతోంది. చర్చ్ వేడుకల్లో పై కప్పు కూలిపోయిందని డియోసెస్ బిషప్ జోస్ అర్మాండో అల్వారెజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. ఇంకా శిథిలాల కింద ఉన్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపస్ లో జాతీయ రహదారిపై ఆదివారం ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది వలసవాదులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్యూబాకు చెందిన వలసవాదులు గ్వాటెమాల నుంచి అమెరికా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story