BTS's Jungkook: " సెవెన్" టీజర్ రిలీజ్

BTSs Jungkook:  సెవెన్  టీజర్ రిలీజ్
X
అదిరిపోయిందంటున్న ఫాన్స్

బీటీఎస్(BTS) సభ్యుడు జంగ్ కుక్(Jungkook) తన సోలో సింగిల్ సెవెన్ టీజర్ (Seven Teaser)ని రిలీజ్ చేశారు. ఈ వీడియో లో జంగ్ కుక్ తో పాటు మరో సౌత్ కొరియన్ బ్యూటీ హాన్ సో హి(Han So Hee) కూడా కనిపించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ టీజర్ 7 మిలియన్ వ్యూస్ ను అధిగమించింది. జంగ్ కుక్ చేస్తున్న ఇండివిడ్యువల్ సాంగ్ కావడంతో దీనికి ఉన్న క్రేజ్ అంతా కాదు.

ఈ టీజర్ లో ఆడియో లేదు కానీ వీడియో ను చూస్తే డేటింగ్ లో ఉన్న జంగ్ కుక్, హాన్ సో హిల మధ్య ఏదో ఒక విషయంపై ఆర్గుమెంట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అదే సమయంలో పై నుంచి ఒక షాండిలియర్ కింద పడుతుంది. ఈ సంఘటన వాళ్ళు ఇద్దరిని తప్ప మిగతావారందరిని ఇబ్బంది పెడుతుంది. జూన్ 14న జరగబోయే సమ్మర్ కాన్సెట్లో ఈ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. అన్నట్టు ఇందులో అమెరికన్ సింగర్ రాపర్ ల్యాటో కూడా కనిపించనుంది.


బీటీఎస్ బ్యాండ్... పాప్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు . ఈ సౌత్ కొరియ‌న్ బ్యాండ్‌కు ప్ర‌పంచం న‌లుమూల‌ల అభిమానులు ఉన్నారు. 2013లో ఏడుగురు స‌భ్యుల‌తో చిన్న గ‌దిలో ఈ మ్యూజిక్ బ్యాండ్ ప్ర‌యాణం మొద‌లైంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే రిచెస్ట్ బ్యాండ్‌గా బీటీఎస్ పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న‌ది.2013 లో ఈ బ్యాండ్ ప్రారంభ‌మ‌య్యే నాటికి అందులోని స‌భ్యులు ఎవ‌రికీ ఇర‌వై ఏళ్ల వ‌యసు కూడా నిండ‌లేదు. సంగీతంపై ఉన్న ప్రేమ వారిని క‌లిపింది. బీటీఎస్ అంటే బ్యాంగ‌ట‌న్ బాయ్స్ అని అర్థం. త‌మ‌పై వ‌చ్చే రూమ‌ర్స్‌, గాసిప్స్ త‌ట్టుకొని ధైర్యంగా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తో బుల్లెట్‌ఫ్రూఫ్ బాయ్స్ స్కౌట్ అనే అర్థం వ‌చ్చేలా ఆ పేరు పెట్టారు.


బీటీఎస్‌లో మొత్తం ఏడుగురు స‌భ్యులు ఉన్నారు. ర్యాప్ మోన్‌స్ట‌ర్ ఈ బీటీఎస్ బ్యాండ్‌కులీడ‌ర్‌. మిగ‌తా స‌భ్యులు సుగా, జేహోఫ్‌, వీ, జిన్‌, జంగ్‌కుక్ కూడా పాట‌లు రాయ‌గ‌ల‌రు, పాడ‌గ‌ల‌రు. డ్యాన్స్ లు చేయ‌గ‌ల‌రు. ఇందులోని ప్ర‌తీస‌భ్యుడు మ‌ల్టీటాలెంటెండ్‌గా పేరుతెచ్చుకున్నారు. వీరు గ్రూప్ గా ప్రోగ్రామ్స్ పెర్ఫార్మ్ చెయ్యడమే కాదు అప్పుడప్పుడు ప్రత్యేక సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

Tags

Next Story