BBC: టీనేజర్ల న్యూడ్ ఫోటోలకు 45 వేల డాలర్లు, BBC యాంకర్ నిర్వాకం

BBC: టీనేజర్ల న్యూడ్ ఫోటోలకు 45 వేల డాలర్లు, BBC యాంకర్ నిర్వాకం

ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ(BBC) వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన ఓ ప్రముఖ యాంకర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ సన్ పత్రిక కథనం వెల్లడించింది. ఒక యువతికి ప్రైవేట్ ఫోటోలు పంపాలని 45000 డాలర్లు చెల్లించినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే బీబీసీ(BBC) సదరు యాంకర్‌ని పదవిలో నుంచి తొలగించి, సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.

ఈ సంచలన కథనాన్ని సన్ పత్రిక శుక్రవారం ప్రచురించడంతో బీబీసీలో ప్రకంపనలు రేగాయి. సదరు బాధితురాలికి తన 17వ యేట నుంచే డబ్బులు పంపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 20 యేళ్లు. డబ్బులు పంపవద్దని సదరు యాంకర్‌ని హెచ్చరించాలని బీబీసీ యాజమాన్యానికి మే నెలలో బాధితురాలి తల్లి వెల్లడించింది. బాధితురాలి తల్లి వెల్లడించిన విషయాల్ని పత్రికలో ప్రచురించింది.


"ఈ విషయాన్ని బీబీసీకి మే నెలలోనే తెలిపినప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాలేదని వెల్లడించింది. వచ్చే డబ్బుతో నా బిడ్డ డ్రగ్స్ బారిన పడినట్లు తల్లి వెల్లడించింది. సంతోషంగా ఉండే తన బిడ్డకి న్యూడ్ ఫోటోలకు డబ్బులు ఇవ్వడంతో, డ్రగ్స్ బారిన పడి పిచ్చిదానిలా తయారయ్యిందని వెల్లడించింది. బ్యాంక్ లావాదేవీల్లో ఆ యాంకర్ ఓ సారి 5000 యూరోలను పంపాడు. నా బిడ్డ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, ఇలా తయారు చేసిన వ్యక్తి టీవీలో వార్తలు చదవడం చూస్తుంటే రగిలిపోయేదాన్ని. నేను అడిగేది ఒక్కటే. డబ్బులు పంపిస్తూ న్యూడ్ ఫోటోలు అడగడం ఆపాలి." అని తల్లి చెప్పిన విషయాల్ని వెల్లడించింది.

ఆ యాంకర్ అందరికీ పరిచయమున్న ప్రముఖ యాంకర్. అతను ఈ పని చేస్తూ తన గుర్తింపును దాచుకోడానికి ప్రయత్నించలేదు. యాంకర్‌గా తన విధులు నిర్వర్తిస్తూనే తన ఫోటోలను పంపేవాడని బాధితురాలి కుటుంబీకులు వెల్లడించారు. అయితే ఆ యాంకర్ ఎవరన్నది అటు బీబీసీ యాజమాన్యం గానీ, సన్ పత్రిక గానీ వెల్లడించలేదు.

ఈ వార్తలపై బీబీసీ వెంటనే స్పందించింది. ఈ ఆరోపణల్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే మే నెలలో వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు భిన్నంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ అంశంపై అన్ని వనరుల్ని ఉపయోగించుకుంటూ సాధ్యమైనంత త్వరగా నిష్పక్షపాతంగా నిజానిజాలు తేల్చుతాం. ఆరోపణలు వచ్చిన యాంకర్‌ని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది.


Tags

Read MoreRead Less
Next Story