Australia: పార్లమెంట్ లో మహిళా సభ్యురాలిపై లైంగిక దాడి

Australia: పార్లమెంట్ లో  మహిళా సభ్యురాలిపై లైంగిక దాడి
X
లిడియా థోర్ప్ అనే సభ్యురాలు సెనేట్ ప్రసంగిస్తూ తాను లైంగిక దాడులకు గురయ్యానని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది

ఆస్ట్రేలియా దేశ చట్టసభలో ఒక మహిళా సభ్యురాలికి అవమానం జరిగింది. లిడియా థోర్ప్ అనే సభ్యురాలు సెనేట్ ప్రసంగిస్తూ తాను లైంగిక దాడులకు గురయ్యానని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది, తనపై తన తోటి సభ్యుడు డేవిడ్ వాన్‌ లైంగికంగా దాడి చేసాడని చెప్పింది. అలాగే తన ప్రసంగం లో ఈ పార్లమెంట్ భవనం మహిళలు పని చేయడానికి "సురక్షితమైన స్థలం కాదు" అని పేర్కొంది. డేవిడ్ వాన్ స్థానిక మీడియా తో మాట్లాడుతూ థోర్ఫ్ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించాడు. థోర్ఫ్ తనపై చేసిన ఆరోపణల్లో యెంత మాత్రం నిజం లేదన్నాడు. ఈ ఆరోపణలతో తాను"తన మనసు పగిలిపోయిందని" పేర్కొన్నాడు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు అన్నాడు. ఈ ఆరోపణలపై వాన్ యొక్క లిబరల్ పార్టీ గురువారం అతన్ని సస్పెండ్ చేసింది.

Tags

Next Story