Indian Students: కెనడా, అమెరికా,యూకేకు తగ్గిన భారతీయ విద్యార్థులు

Indian Students: కెనడా, అమెరికా,యూకేకు తగ్గిన భారతీయ విద్యార్థులు
X
ఐదేళ్లలో ఇదే తొలిసారి!

విదేశాలకు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేండ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయ విద్యార్థుల్లో అధికభాగం అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్‌ వీసాల్లో 25 శాతం తగ్గుముఖం పట్టింది. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం, బ్రిటన్‌కు వెళ్లే వారి సంఖ్య 26 శాతం, కెనడాకు వెళ్లేవారి సంఖ్య 32 శాతం తగ్గింది. కెనడాకు వెళ్లేవారి సంఖ్య 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు తగ్గినట్టు ఇమిగ్రేషన్‌ వర్గాలు తెలిపాయి.

విద్యార్థులకు అమెరికా ఇచ్చే ఎఫ్‌-1 వీసాల సంఖ్య 1,31,000 నుంచి 86,110కి తగ్గింది. ఆయా దేశాల్లో వలస నిబంధనలు కఠనతరం కావడం వల్లనే ఈ మార్పు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోవైపు కెనడా, భారత్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం ఈ పరిస్థితికి తోడైంది. గృహ, ఆరోగ్య, ఇతర సేవలు భారంగా మారుతున్నాయన్న సాకుతో 2026 నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్యను ఐదు శాతం తగ్గించాలని కెనడా నిర్ణయించింది. బ్రిటన్‌ కూడా విదేశీ విద్యార్థులు తమపై ఆధారపడే వారిని (డిపెండెంట్స్‌ను) తీసుకురాకుండా నిబంధనలు విధించింది. దీంతో ఆ దేశానికి కూడా వీసాకు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గింది. నిజానికి గత పదేండ్లలో ఈ మూడు దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2022, 23లో భారతీయులు చైనాను దాటేశారు కానీ 2024లో మళ్లీ తగ్గిపోయారు.

Tags

Next Story