Pak PM : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... పాక్ ప్రధాని కీలక నిర్ణయం..!

Pak PM : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... పాక్ ప్రధాని కీలక నిర్ణయం..!
Pak PM : పాక్ దేశానికి కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ మొదటిరోజే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు..

Pak PM : పాక్ దేశానికి కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ మొదటిరోజే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వీక్లీ ఆఫ్‌లు రద్దు చేసి ఆదివారమే సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల సమయాన్ని ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలకు పెంచారు.

ఇకపై వారంలో రెండు రోజులు సెలవులు ఉండవోవని.. ఒక అధికారిక వారపు సెలవు మాత్రమే ఉంటుందని ఆదేశించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి సేవా చేసేందుకు, నిజాయతీతో, శ్రద్ధతో పనిచేయాలని సూచించారు.

పింఛను పెంపు, రూ. 25 వేలకు పెంపు హామీలను తక్షనమే అమలు చేయాలని అధికారులని సూచించారు. కాగా షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ దేశానికి 23వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Tags

Next Story