Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023గా నికరాగ్వా సుందరి

ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటం ఈ ఏడాది నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ పలాసియోస్ ‘మిస్ యూనివర్స్ -2023’ టైటిల్ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్.. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు.
అందం, కరుణ, తెలివితేటలతో అబ్బురపరిచే ప్రదర్శనలో నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని దక్కించుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆకర్షించింది. శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన ఈ అందాల పోటీల్లో 84 సుందరీమణులు పోటీ పడ్డారు.
నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్‌లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది. తన పేరు ప్రకటించగానే షేనిస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అంతకుముందు కొన్ని క్షణాలపాటు ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. క్షణాలు ఉద్విగ్నంగా మారాయి. అమెరికాకు చెందిన మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోనీ గాబ్రియెల్ విజేత షేనిస్‌కు కిరీటం తొడిగింది.
మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిసింది. ఆస్ట్రేలియాకు చెందిన మోరయ విల్సన్ సెకండ్ రన్నరప్‌గా నిలవగా, థాయిలాండ్ ముద్దుగుమ్మ అంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్‌గా ఎంపికైంది.
మిస్ యూనివర్స్ 2023 అందాల పోటీల్లో చండీగఢ్‌కు చెందిన శ్వేత శారద భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. టాప్-20 ఫైనలిస్టుల్లోకి చేరినా ఆ తర్వాత వెనకబడింది. పాకిస్థాన్ కూడా తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంది. ఈ 72వ మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో మొత్తం 84 దేశాల అందాల భామలు పాల్గొన్నారు. అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ జీనీ మాయ్, మిస్ యూనివర్స్ 2012 ఒలివియా కల్పోతోపాటు అమెరికన్ టీవీ ప్రజెంటర్ మారియా మెెనౌనోస్ ఈ పోటీలకు హోస్ట్‌గా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com