పాకిస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలిస్తే షాక్..

పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు.
పిండి, పప్పు, నూనె, చక్కెర, పాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీనితో పాటు, గ్యాస్ ధరలు కూడా పెరగడంతో బ్రతుకు భారమవుతోంది. భారతదేశంలో 14 లీటర్ల గ్యాస్ సిలిండర్ రూ.800 నుంచి రూ.900 వరకు విక్రయిస్తుండగా, పాకిస్థాన్‌లో 12 లీటర్ల గ్యాస్ సిలిండర్‌ను 3530 రూపాయలకు విక్రయిస్తున్నారు.
The Price Index.pk నివేదిక ప్రకారం, ఆగస్టు 2024లో పాకిస్తాన్‌లో ఒక కిలో LPG ధర రూ. 300. 12 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర 3530 పాకిస్థానీ రూపాయలు. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర గురించి మాట్లాడినట్లయితే, ఒక సిలిండర్ ధర 13,400 పాకిస్తాన్ రూపాయలు. అయితే, ఈ వాణిజ్య గ్యాస్ సిలిండర్‌లో 45.5 కిలోల ఎల్‌పిజి గ్యాస్ ఉంటుంది.
పాకిస్థాన్‌లో కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇనుప గ్యాస్ సిలిండర్‌లు కూడా లేని పరిస్థితి. ఈ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు కిలోల గ్యాస్‌ను సన్నని ప్లాస్టిక్ పొరలో నింపి ఇంటికి తీసుకెళ్తుంటారు. ఇది చాలా ప్రాణాంతకం. కొంచెం అజాగ్రత్త వహించినా ఈ పొర లాంటి సిలిండర్ బాంబులా పేలగలదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com