Brazil: తాగుతూ సలహాలిచ్చిన తండ్రి.. ఫ్లైట్ కూల్చేసిన కొడుకు

Brazil: తాగుతూ సలహాలిచ్చిన తండ్రి.. ఫ్లైట్ కూల్చేసిన కొడుకు
విమానం కూలి తండ్రి, కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

తండ్రి హాయిగా కూర్చొని మందు కొట్టాడు. కొడుకు పక్కనే కూర్చొని ఫ్లైట్ నడిపాడు. ఫలితంగా విమానం కూలిపోయి ఇద్దరూ మరణించారు. బ్రెజీల్‌లో ఓ విమానం కూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూలిపోవడానికి కాసేపటి ముందు పోస్ట్ చేసినట్టుగా వైరల్ అయిన ఈ వీడియోలో 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా, తండ్రి పక్కన కూర్చొని సలహాలు ఇస్తూ, వీడియో తీస్తూ సీట్లో బీర్ తాగినట్టు కనిపించింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం..

జులై 29న గారాన్ మాయా అనే పరిశోధకుడు తన పదకొండేళ్ల కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో రాండోనియా నగరం నుంచి, ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బేరాన్ 58 విమానంలో బయలుదేరాడు. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు. తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి వద్ద దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫ్యూయల్ నింపుకొని బయలుదేరిన కాసేపటికే విమానం అడవిలో కూలిపోయింది. అయితే వీడియో ఎప్పుడు తీశారు, లైట్ కూలిపోయే సమయానికి ఎవరు దానిని నడిపిస్తున్నారు అన్న విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో గారాన్ తన కొడుకుకి విమానం ఎలా నడపాలో సలహాలు చెపుతుండటం స్పష్టంగా కనిపించింది. బ్రెజిల్ ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం, 18 ఏళ్లు నిండి, హైస్కూల్ పూర్తి చేసినవారు మాత్రమే విమానాలు నడిపేందుకు అర్హులు. కానీ ఆ బాలుని వయసు 18 కాదు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story