US: అమెరికాలోని కళాశాలలో కాల్పులు.. విద్యార్థి మృతి

అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక కళాశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 5 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన కళాశాలలో భయాందోళనకు దారితీసింది. ఈ సంఘటన ఎలిజబెత్ సిటీ విశ్వవిద్యాలయంలో జరిగింది. యార్డ్ ఫెస్ట్ సమయంలో అకస్మాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ కరోలినా యూనివర్సిటీ క్యాంపస్‌లో యార్డ్ ఫెస్ట్ జరుగుతోంది. బ్లాక్ యూనివర్సిటీలో నిర్వహించబడే ఈ ఉత్సవం ఒక వారం పాటు కొనసాగుతుంది. అయితే, ఉత్సవం చివరి రోజున కాల్పుల సంఘటన ఆందోళనకు గురిచేసింది.
ఈ కాల్పుల్లో 24 ఏళ్ల యువకుడు మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. విశ్వవిద్యాలయం స్పందిస్తూ.. గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. ఈ అమానుష సంఘటన పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ మొత్తం విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని ప్రకటించింది. వర్జీనియా నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో 2,300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఘటనతో క్యాంపస్ లో సెక్యూరిటీని పెంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com