US: అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు.. ముగ్గురు మృతి

కెనడా లోని ఓ స్కూల్‌లో కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం టంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్న వ్యక్తి కూడా తనను తాను గాయపర్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరు కూడా స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనతో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారు మరెక్కడైనా ఉన్నారేమోనని తెలుసుకోవడానికి పోలీసులు యత్నాలు మొదలుపెట్టారు. కాల్పుల ఘటనకు సమీపంలోని ఇళ్లల్లో భారీగా తనిఖీలు చేపట్టారు. ఇక షూటర్‌ను ఇప్పటికే దర్యాప్తు బృందాలు గుర్తుపట్టినా.. అతడి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
