PAKISTHAN SHOCKER: పాకిస్తాన్‌లో సిక్కు వ్యాపారి హత్య
పాకిస్థాన్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఓ సిక్కు వ్యాపారి హత్యను మరచిపోకముందే మరో సిక్కు వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పెషావర్‌లోని కక్షల్ పరిసర ప్రాంతంలో మన్మోహన్ సింగ్ అనే సిక్కు వ్యాపారిని..బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. గుల్దారా చౌక్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో సిక్కు వ్యాపారిని మోటారు సైకిళ్లపై వచ్చిన వారు హత్య చేసినట్లు పెషావర్ ఎస్పీ అబ్దుల్ సలామ్ ఖలీద్ తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు పారిపోయారని... వారు ఎందుకు హత్య చేశారో తేలాల్సి ఉందని వెల్లడించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం అదే ప్రాంతంలో మరో సిక్కు వ్యాపారి టర్లోగ్ సింగ్‌పై దాడి జరిగిందని పెషావర్ పోలీసులు తెలిపారు. ఈరెండింటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేది తేలాల్సి ఉందని వివరించారు. ఈ ఏడాది మార్చిలో ముష్కరులు బైక్‌పై వచ్చి ఓ దయాల్ సింగ్ అనే సిక్కు వ్యాపారిని కాల్చి చంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com