Sikhs for Justice : హిందువులు కెనడాను వదిలిపోండి,

Sikhs for Justice : హిందువులు కెనడాను వదిలిపోండి,
అల్టిమేటం జారీ చేసిన ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ

కెనడా ప్రభుత్వం, భారత్ లమధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారతదౌత్య వేత్తను కెనడా, కెనడా దౌత్య వేత్తను భారత్ ఇప్పటికే బహిష్కరించాయి. ఇదే సమయంలో ఇక కెనడాలో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులు కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది. ఈ విధంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ విడుదల చేశారు. ఇందులో ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఈ విషయంలో భారత్ కు కెనడాలో ఉన్న హిందువులందరూ మద్దతుగా నిలిచారని గుర్ పట్వంత్ పేర్కొన్నాడు. కెనడాలో ఉన్న ఇండో-హిందూ వెంటనే దేశాన్ని వీడాలని హుకుం జారీ చేశాడు.


కెనడాలో ఉన్న హిందువులంతా భారత్ కు మద్దతు నిలవడమే కాకుండా ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ ప్రకటన వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారంటూ మండిపడ్డాడు. దేశాన్ని విడిచి వెళ్లాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించాడు. పట్వంత్ విడుదల చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ హెచ్చరికపై కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ అధికార ప్రతినిధి విజయ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హిందూఫోబియాను కెనడా అంతటా పెద్ద ఎత్తున అలుముకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే పట్వంత్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పటికే ఖలిస్థానీలను ప్రోత్సహిస్తున్న కెనడా హిందువుల భద్రతకు ఎలాంటి చర్యలు చేపడతుందో చూడాలి.


2023 జూన్ 18న ఖలిస్థాన్ మద్దతుదారుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య భారత ఏజెంట్ల పనే.. ఇందుకు సంబంధించి మా దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది.. అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వెంటనే భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించగా.. ఇండియా సైతం దీనికి బదులు తీర్చుకుంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పాతాళానికి పడిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story