Singapore PM: సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లూంగ్

ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్ లూంగ్(72) ఆ బాధ్యతలు వీడనున్నారు. మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ఆయన సోమవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఆ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భర్తీ చేయనున్నారు. ఆ దేశ మూడో ప్రధానిగా లీ సీన్ లూంగ్ 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవిని వీడాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.
ఉప ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్‌ను సింగపూర్ ప్రధానమంత్రిగా నియమించాలని రాష్ట్రపతికి ప్రధానమంత్రి కార్యాలయం లేఖ రాసింది. లేఖ రాసిన కొద్దిసేపటికే తాను ఈ పదవిని అంగీకరించినట్లు వాంగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సింగపూర్ మూడో ప్రధానిగా లీ సీన్ లూంగ్ 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. లూంగ్ గతంలోనే పదవిని వీడాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.
లీసీన్ సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ పెద్ద కుమారుడు. 31 ఏళ్ల తన పదవీకాలంలో సింగపూర్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా నిలిపారు. అయితే కఠినమైన ప్రభుత్వ ఆంక్షలు, మీడియాపై నియంత్రణ, అణచివేత చట్టాలను వినియోగించడం, అసమ్మతి వాదులపై సివిల్ కేసులు బనాయించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com