Modi gifts: బహుమతులలో భారతీయత

Modi gifts: బహుమతులలో భారతీయత
ఫ్రాన్స్ ప్రముఖులకు భారతీయత ఉట్టిపడే బహుమతులు ఇచ్చిన ప్రధాని

ప్రధాని మోదీ దేశం దాటి ఎక్కడికి వెళ్లినా భారత దేశం గొప్పదనాన్ని, సంస్కృతిని చాటే ప్రయత్నం చేస్తారు. బహుమతులతో బంధాన్ని మరింత పటిష్టం మారుస్తారు. తాజాగా తన ఫ్రాన్స్ పర్యటనలో కూడా ఆయన అదే చేశారు. భారతీయత ఉట్టిపడే గిఫ్టులను ఫ్రాన్స్ అధ్యక్షులు, ప్రధాని తదితరులకు అపురూపమైన బహుమతులు అందజేశారు.

మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి. అందుకే మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది. మన సంస్కృతే జాతి విశిష్టతను, ఉన్నతిని చక్కగా తెలియజేస్తుంది. అవి బయటపడడానికి అనుకూలమైన బహుమతులనే మోడీ ఫ్రాన్స్ కి తీసుకు వెళ్లారు.


ఇది ప్యూర్ శాండల్‌వుడ్ ఉపయోగించి చేతులతో తయారు చేసిన అంబారీ ఏనుగు. దీన్ని ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్.. గెరార్డ్ లాచెర్‌కి మోదీ గిఫ్టుగా ఇచ్చారు. ఇది ఎంత స్వచ్ఛమైనది అంటే ఈ ఏనుగు ఎక్కడ ఉంటే అక్కడ పరిమళాలు వెదజల్లుతుంది.



ఈ కాశ్మీరీ తివాచీని ప్రధాని మోదీ, ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బ్రావున్ పివెట్‌కి గిఫ్టుగా ఇచ్చారు. సుతిమెత్తగా ఉండే ఈ తివాచీలు వరల్డ్ ఫేమస్. ఒక్కో వైపు నుంచి ఒక్కో షేడ్ వచ్చే ఈ తివాచీ అందం అంతా ఇంతా కాదు.



ఇక పాలరాతితో చేసిన చిన్న టేబుల్. దీన్ని ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రధాని ఎలిసాబెత్ బోర్నేకి గిఫ్టుగా ఇచ్చారు. పాలరాతితో చేసిన ఈ పీఠంపై విలువైన రాళ్లను సెట్ చేశారు. ఈ పాలరాయిని రాజస్థాన్ లోని మక్రానా నుంచి తెప్పిందారు. ఇది అత్యంత నాణ్యమైన పాలరాయి.



భారతదేశంలోని పట్టు చీరలు దేశంలోని నేత కార్మికుల అద్భుతమైన నైపుణ్యానికి సజీవ ఉదాహరణ. మన పోచంపల్లి పట్టు చీరని ఒక శాండల్‌వుడ్ బాక్సులో ఉంచి ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రన్‌గి గిఫ్టుగా ఇచ్చారు ప్రధాని మోదీ. పోచంపల్లి శిల్క్ శారీకి భారతీయ టెక్స్‌టైల్ చరిత్రలో తిరుగులేని పేరుంది. అద్భుతమైన డిజైన్లు, మెరిసే రంగులు, చక్కని కళాత్మకతతో పోచంపల్లి పట్టుచీరలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.


ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ కు మోడీ స్వచ్ఛమైన చందనంతో తయారు చేసిన సితార్ వాయిద్యాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిపై గణపతి సరస్వతి దేవి, చిత్రాలు ఉంటాయి. మన జాతీయ పక్షి నెమలి కూడా దీనిపై అందంగా నిలబడి ఉంది. దీనిపై మీటే తీగలను సైతం చందనంతో ఎంత అందంగా చెక్కారంటే ఆ గిఫ్ట్ చూసిన వెంటనే మాక్రాన్ మొఖంలో ఆనందం, ఆశ్చర్యం వెల్లివిరిసింది.

Tags

Read MoreRead Less
Next Story