Slovakia: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..

Slovakia: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..
ఖండించిన బైడెన్‌, పుతిన్‌

స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడ్డాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో దేశ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజధానికి ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ముట్టడించారు. కీలకమైన యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు మూడు వారాల ముందు స్లోవేకియాలో కాల్పులు జరిగాయి. ప్రధాని ఫికోపై జరిగిన దాడిని ఆ దేశ ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ దాడిని ప్రెసిడెంగ్ జునానా కాపుటోవా క్రూరమైనదిగా వర్ణించారు. క్లిష్టసమయంలో రాబర్ట్ ఫికోకు అండగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఫికో కరడుగట్టిన రైట్ వింగ్ నాయకుడిగా పేరుంది. పాశ్చాత్య దేశాలను కాదని, ఇతను హాలాండ్ మార్గాన్ని అనుసరిస్తున్నారనే పేరుంది. ఫికో విధానాలను నిరసిస్తూ వేలాది మంది రాజధానిలో మరియు స్లోవేకియా అంతటా ఇటీవల ర్యాలీలు నిర్వహించారు. ఫికోపై దాడిని యూరప్ లోని ఇతర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘తమ ఆలోచలన్నీ ఆయన కుటుంబం, స్లోవేకియా ప్రజలతోనే ఉన్నాయి. "త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ భయంకరమైన హింసాత్మక చర్యను ఖండిస్తున్నాం. ఎంబసీ స్లోవేకియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది’ అంటూ బైడైన్‌ ట్వీట్‌ చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా సైతం స్పందించారు. ఘటన గురించి విని షాక్‌ అయ్యానని ట్వీట్‌ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫికోపై దాడిని ఖండిస్తూ ఖండించారు. దాడి ఘటనను ‘రాక్షసమైన నేరం’గా అభివర్ణించారు. ఫికో ధైర్యవంతుడని.. దృఢమైన వ్యక్తి అని తెలుసునన్నారు. లక్షణాలు అతనికి క్లిష్ట పరిస్థితిని తట్టుకోవడంలో సహాయపడతాయన్నారు. ఫికో త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.

Tags

Next Story