అంతర్జాతీయం

ఇప్పటివరకు బైడెన్‌కు 49.4 శాతం, డొనాల్డ్‌ ట్రంప్‌నకు 49.1 ఓటింగ్ శాతం‌ నమోదైంది

అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం ఆధిక్యం మారుతున్నాయి. ట్రంప్‌, బైడెన్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి..

ఇప్పటివరకు బైడెన్‌కు 49.4 శాతం, డొనాల్డ్‌ ట్రంప్‌నకు 49.1 ఓటింగ్ శాతం‌ నమోదైంది
X

అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం ఆధిక్యం మారుతున్నాయి. ట్రంప్‌, బైడెన్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం ఫలితాలు రావాల్సిన ఏడు రాష్ట్రాల్లో... క్షణక్షణం ఫలితాలు మారిపోతున్నాయి.మిషగన్‌లో జోబైడెన్‌ ఆధిక్యంలోకి వచ్చారు. ఇక్కడ ఇప్పటికే 94 శాతం కౌంటింగ్‌ పూర్తైంది. జోబైడెన్‌కు 49.4 ఓటింగ్‌ శాతం రాగా, డొనాల్డ్‌ ట్రంప్‌నకు 49.1 ఓటింగ్‌ నమోదైంది. నొవేడా, విస్కాన్సిన్‌లో ఇప్పటికే బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు మిషగన్‌లో ఆయన దూసుకుపోతుండటంతో... ఫలితాలు మారే అవకాశాలున్నాయి. జార్జియా, నార్త్‌ కరోనాలినా, పెన్సిల్వేనియా, అలస్కాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది.

Next Story

RELATED STORIES