Solar storm: భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుఫాను

రెండు దశాబ్దాలలో చూడని శక్తిమంతమైన సౌరతుపాను భూమిని తాకింది. దీంతో టస్మామానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశంలో అరోరాలు దర్శనమిచ్చాయి. ప్రజలు కూడా వీటిని ఆసక్తిగా తలికించారు. సౌరతుపాను ధాటికి ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గడిచిన రెండుదశాబ్దాల్లో లేనటువంటి శక్తివంతమైన సౌర తుఫాన్ శుక్రవారం భూమిని తాకింది. దీంతో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేశాయి. టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు .. వినీలాకాశం వింత వింత రంగుల్లో శోభించింది. ఆ శక్తివంతమైన సౌర తుఫాన్ ధాటికి శాటిలైట్లు, పవర్ గ్రిడ్‌ల‌్లో సమస్యలు తలెత్తనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ సూర్యుడి నుంచి వెలుబడ్డనట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. అయితే సౌర తుఫాన్ తీవ్రంగా ఉండటంతో....ఎక్స్‌ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.
సౌరతుపాను వల్ల ఆకాశంలో అరోరాలు ఏర్పడ్డాయి. ఉత్తర ఐరోపా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆకాశం రంగు రంగుల్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నార్తర్న్ లైట్స్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ లైట్స్ కంటికి నేరుగా కనిపించినట్లు బ్రిటన్‌లో స్థానికులు చెప్పారు. టాస్మానియాలో మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆకాశంలో ఆరోరాలు దర్శనమిచ్చాయి. సౌర తుఫాన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని, అందుకే శాటిలైట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్, పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com