South Korea: దక్షిణ కొరియా విపక్ష నేతపై కత్తితో దాడి..

South Korea: దక్షిణ కొరియా విపక్ష నేతపై కత్తితో దాడి..
మీడియాతో మాట్లాడుతుండగా ఘటన

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూగ్‌పై దుండగుడు దాడిచేశాడు. మంగళవారం ఉదయం బుసాన్‌లో పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మ్యూంగ్‌ వెంటనే కింపడిపోయారు. వెంటనే ఆయనను దవాఖానకు తరలించారు.

గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. నగరంలోని కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన లీపై దాడి జరిగిందని బుసాన్ అత్యవసర అధికారులు తెలిపారు.లీ స్పృహలో ఉన్నారని, అయితే అతని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. దీని గురించి ఇంకా సమాచారం లేదు. లీ మెడను గాయపరిచేందుకు ఆ వ్యక్తి కత్తిలాంటి ఆయుధాన్ని ఉపయోగించాడని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.


కాగా, దాడి అనంతరం పారిపోతుండగా అక్కడ ఉన్నవారు దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దాడిచేసినట్లు అధికారులు తెలిపారు. దాడి తర్వాత 59 ఏండ్ల మ్యూంగ్‌ స్పృహలోనే ఉన్నారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చేతిలో మ్యూంగ్‌ ఓడిపోయారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్‌లో 24 రోజులపాటు నిరషన దీక్ష చేశారు. పార్టీ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారి లీని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వార్తా సంస్థ Yonhap ప్రకారం, దాడి చేసిన వ్యక్తి వయస్సు 50, 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొంది. ప్రతిపాదిత విమానాశ్రయ ప్రదేశాన్ని సందర్శిస్తున్న లీపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని యోన్‌హాప్ చెప్పారు. నివేదికల ప్రకారం, దాడిలో అతని మెడపై సుమారు 1 సెంటీమీటర్ గాయమైందన్నారు. యోన్‌హాప్ ప్రకారం, లీపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగుడు అతని పేరు గల పేపర్ కిరీటం ధరించాడు. దాడి చేసిన వ్యక్తి ఆటోగ్రాఫ్ అడగడానికి లీ వద్దకు వచ్చాడని, ఆపై అకస్మాత్తుగా ముందుకు వెళ్లి అతనిపై కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు.

వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిని ఘటనా స్థలంలో అరెస్టు చేసినట్లు యోన్‌హాప్ తెలిపారు. YTN టెలివిజన్‌లో ప్రసారం చేయబడిన, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మరొక వీడియో క్లిప్‌లో, ఒక వ్యక్తి లీపై దాడి చేయడం కనిపించింది. ఈ దాడి తర్వాత లీ కిందపడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story