లిబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇసుక తుఫాన్‌లు

ఆఫ్రికా దేశమైన లిబియాను ఇసుక తుఫాన్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశంలోని దక్షిణ, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. నైరుతి వైపు నుంచి వీస్తున్న పెను గాలుల ప్రభావంతో భారీగా ఇసుక లేచిపడుతోంది. దాంతో లిబియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక తుఫాన్‌ల కారణంగా రహదారులు కనిపించక ఎక్కడిక్కడే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో లిబియా ప్రభుత్వం అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ఆదేశించింది.
బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఇసుక తుఫాన్ల ప్రభావం మరింత పెరిగింది. మార్చి 22న గాల్లోకి ఎగిసిపడిన దుమ్ము కారణంగా ఆకాశం మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com