Spain: స్పెయిన్‌ను కమ్మేస్తున్న కార్చిచ్చు
స్పెయిన్(spain)లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. కానరీ దీవులలోని లా పాల్మాలో శనివారం చెలరేగిన కార్చిచ్చు( wildfire) ఇళ్లను, వేల ఎకరాల్లో అడవిని దహనం చేసేస్తోంది. కార్చిచ్చు కారణంగా 4వేల మంది(4,000 people)కి పైగా స్థానికులు నివాసాలను ఖాళీ(evacuated) చేశారు. సుమారు 11,500 ఎకరాల అడవిని అగ్నికీలలు( wildfire) దగ్ధం చేశాయి. మరికొందరు తమ నివాసాలను వీడేందుకు నిరాకరిస్తుండటంతో బలవంతంగా తరలిస్తున్నారు. వాటర్ డ్రాపింగ్ ప్లేన్‌లు, 10 హెలిక్యాప్టర్‌ల సాయంతో అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కార్చిర్చు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. విస్తరిస్తున్న అగ్ని కీలలు ఇప్పటికే దాదాపు 3000 భవనాలను బుగ్గి చేశాయి. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగే వరకు ద్వీపంలోని వాయువ్య ప్రాంతం దగ్గరకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
పుంటగోర్డా, టిజారఫే గ్రామాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అగ్నికీలలు చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు కానరీ దీవుల అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో(Fernando Clavijo, president of the Canary Islands) హెచ్చరించారు. అటవీ ప్రాంత నివాసితులంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కెనరీ దీవుల్లో(Spanish Canary Island)ని లా పాల్మా( La Palma) కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు కారణమైంది. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోక పోయినా అరటి తోటలతోపాటు ఇతర వ్యవసాయ పంటలు తగులబడిపోయాయి. కార్చిచ్చును అణచడం కోసం మరిన్ని ప్లేన్‌లు, హెలిక్యాప్టర్లను రంగంలోకి దించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.కార్చిచ్చు క్రమంగా అదుపులోకి వస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతర శ్రమతో పరిస్థితి కుదుటపడ్డట్టు అధికారులు తెలిపారు. 400 మంది సైనికులు,అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు వివరించారు. నీళ్లు జల్లే విమానాలు, 10 హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
స్పెయిన్ రాజు ఫెలిపే VI అటవీ దహనంపై ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంటలను అదుపు చేసేందుకు సైన్యాన్ని కూడా మోహరించినట్లు ప్రభుత్వం.. స్పెయిన్ రాజుకు తెలిపింది. 2021లో స్పెయిన్‌లో చెలరేగిన మంటలు మూడు నెలల పాటు కొనసాగాయి. దీనివల్ల బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. కానరీ దీవుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అగ్ని సమీపించే వరకు వేచి ఉండకుండా వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని ఫైర్ ఫైటర్స్ హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com