Sri Lanka : శ్రీలంకలో పది గంటలు పవర్ కట్..!

Sri Lanka : ఆర్ధిక సంక్షోభంతో అల్లాడిపోతుంది సింహాదేశమైన శ్రీలంక.. పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.. ఇప్పుడు వారికి మరో షాకిచ్చింది ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా పది గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడంతో ఇంధన కొరత తీవ్రమైందని, థర్మల్ పవర్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు లేదని తెలిపింది. ప్రభుత్వం త్వరలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఎల్ఐఓసీ వద్ద కొనుగోలు చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గామిని లోకుజే తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక మందులు కూడా కొనలేని పరిస్థితిని ఎదురుకుంటుంది. అయితే శ్రీలంకకు తక్షణ సాయం చేయనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com