Sri Lankan Cabinet: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక మంత్రి వర్గం రాజీనామా

Sri Lankan Cabinet : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మంత్రి వర్గం రాజీనామా చేసింది. ఆ దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను మంత్రులు అందించారు. రాజీనామా చేసిన వారిలో ఆ దేశ ప్రధాని కుమారుడు, నమల్ రాజపక్స కూడా ఉన్నారు. క్రీడలు, యువజన శాఖ మంత్రిగా ఉన్న నమల్ రాజపక్స తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు. సంక్షోభం నేపథ్యంలో మార్చి 31 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాడు అధ్యక్షుడు రాజపక్సే.
దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు గొటల రాజపక్సకు రాజీనామాను అందించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఐతే ఈ వార్తాలను కొట్టిపారేసింది ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం. అవి తప్పుడు వార్తాలుగా పేర్కొంది. రాజీనామాపై వస్తున్న వార్తాలను ప్రధాని మహింద రాజపక్స మీడియా సెక్రటరీ తిరస్కరించారు. కానీ ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్ని రోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. ఈ ఆందోళనలు అణచివేసేందుకు రాజపక్స అత్యవసర పరిస్థితి సహా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని..కరోనా మహామ్మారి కారణంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశి మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com