Mahinda Rajapaksa : : ప్రధాని పదవికి మహింద రాజపక్సే రాజీనామా..!

Mahinda Rajapaksa : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో...ప్రతిపక్షాల నిరసనల ఉధృతంగా సాగటంతో...మహింద రాజపక్స దిగిరాక తప్పలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే అధ్యక్షుడు సంసిద్ధత తెలిపారు.శ్రీలంక ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉన్నారన్నారు మహింద రాజపక్స. సంక్షోభ పరిస్థితుల సమయంలో అందరూ సంయమనం పాటించాలన్నమహింద రాజపక్స విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు రాజపక్స.
ఆర్థిక సంక్షోభంతో నెల రోజుల నుంచి లంకద్వీపంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. లంకేయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆకాశాన్నంటిన ధరలు, చమురు కొరత శ్రీలంకను కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే మూడు వారాల్లో రెండుమార్లు ఎమెర్జన్సీ విధించారు. తాజా పరిస్థితులపై సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల నేతలకు ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com