Los Angeles : లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Los Angeles : లాస్ ఏంజెల్స్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ ఏంజెల్స్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్‌ఏంజెల్స్ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల మధ్య కళ్యాణం జరిగింది.
అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది.
దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com