Srilanka: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడు

శ్రీలంకలో గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించిన ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నారా అంటే అవును ప్రభాకరన్ బ్రతికే ఉన్నారంటూ తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నేత నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని టీఎన్ఎం లీడర్ నేడుమారన్ స్పష్టం చేశారు. ప్రభాకరన్ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ప్రభాకరన్‌తో టచ్‌లో ఉందని ఐతే ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే వెల్లడించలేనన్నారు. తాను ఈ ప్రకటన ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తున్నట్టు నెడుమారన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం శ్రీలంకలో ఆందోళనలు చెలరేగుతున్నాయని ప్రభాకరన్‌ను మళ్లీ బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని నేడుమారన్ వివరించారు. ప్రభాకరన్ సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని, ప్రత్యేక తమిళ్ ఈలంను ఏర్పాటు చేయడానికి తన వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళికలను తెలియజేస్తాడని తెలిపారు.
2009లో శ్రీలంకలో తమిళ ఈలంను హస్తగతం చేసుకోవడానిఇకి యుద్ధం జరిగింది. ఇందులో ఎంతోమంది లంకన్ తమిళులు చనిపోయారు. ఈ వార్ చివరి దశలో ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ మరణించినట్టు ప్రకటించారు. అంతేకాదు, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే యుద్ధ నేరాలకు గాను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోవాలని భావించాయి. 2009, మే 18న ప్రభాకరన్ మృతి చెందారని శ్రీలంక సైన్యం ప్రకటించింది. అయితే అప్పుడు ప్రభాకరన్ మరణించాడని లంక ప్రభుత్వం చూపించిన డెడ్ బాడీ నిజంగా ప్రభాకరన్‌దే అని ఇప్పటికీ నిరూపించలేదన్న విమర్శలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com