Bangladesh: హసీనా సైలెంట్‌గా ఉంటే మంచిది-యూనస్
హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తల దాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ హెచ్చరికలు జారీ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్ ఆమెను అప్పగించాలని ఇండియాను కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని కోరారు. ఇది బంగ్లాకు, భారత్‌కి మంచిదని చెప్పారు. భారత్‌తో బంగ్లా బలమైన సంబంధాలకు విలువనిస్తుండగా, ‘‘ అవామీ లీగ్ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఇస్లామిక్‌గా చిత్రీకరించి, షేక్ హసీనా లేకుండా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని విడిచి న్యూఢిల్లీ ముందుకు సాగాలి’’ యూనస్ అన్నారు.
భారత్‌లో కూడా ఆమె వైఖరితో ఎవరూ సుఖంగా లేరని, ఎందుకు ఆమెని తిరిగి తమకు అప్పగించాలని మేము కోరుతామని అతను చెప్పాడు. ఆమె మౌనంగా ఉంటే మేము, మా ప్రజలు ఆమెని మరిచిపోయేవాళ్లం. ఆమె తన సొంత ప్రపంచంలో ఉండేదాన్ని కూడా మరిచిపోయేవారు అని ఆయన అన్నారు. కానీ ఆమె భారతదేశంలో కూర్చొని మాట్లాడటం, ఎవరికీ ఇష్టం లేదు అని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా సాగిన హింసాత్మక ఆందోళన నేపథ్యంలో ఆగస్టు 05న ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయారు. ప్రస్తుతం ఆమెకు భారత్ రాజకీయ ఆశ్రయం కల్పించింది. ఇదిలా ఉంటే, ఆమె బంగ్లా వదిలేసిన తర్వాత అక్కడ ఆమె పార్టీ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తల హత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో పాటు ఆమెపై బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద, విధ్వంస నేరాలు, హత్య నేరాల కింద పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆమెపై విచారణ సాగుతుందని యూనస్ ఇటీవల స్పష్టం చేశారు.
‘‘ఆమె మౌనంగా ఉండాలని మేము గట్టిగా చెబుతున్నాము. ఇది మా ఫ్రెండ్లీ రిక్వెస్ట్. ఆమెకి అక్కడ(భారత్)లో ఆశ్రయం కల్పించబడింది. ఆమె అక్కడ నుంచి ప్రచారం చేస్తోంది. ఆమె సాధారణ స్థితిలో అక్కడికి వెళ్లింది కాదు. ప్రజల ఆగ్రహం తిరుగుబాటుతో ఆమె పారిపోయింది’’ అని అతను చెప్పారు. బంగ్లాదేశ్ దురాగతాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలకు న్యాయం జరిగేలా తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని, న్యాయం జరగాలంటే ఆమెను తిరిగి దేశానికి తీసుకురావాలని యూనస్ పేర్కొన్నారు. ఆమెను తిరిగితీసుకురాకుంటే ప్రజలు శాంతించరు, ఆమె చేసి అఘాయిత్యాలను ఇక్కడ అందరి ముందు విచారించాల్సి ఉంటుంది. ఇండొ-బంగ్లా సంబంధాలు కీలకమని, అయితే, హసీనాను భారత్, తమకు అప్పగించాలని బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ వ్యాఖ్యానించిన కోన్ని రోజులకే యూనస్ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com