Australian store: రండి.. దోచుకోండి' బట్టల షాప్ యజమాని దిమ్మ తిరిగే ఆఫర్‌..

Australian store: రండి.. దోచుకోండి బట్టల షాప్ యజమాని దిమ్మ తిరిగే ఆఫర్‌..
X
30 సెకనులలో సుమారు 400 వస్తువులు ఖాళీ

సహజంగా ఏదైనా షాపు ప్రారంభోత్సవం సందర్భంగా 50 శాతం లేదా 80 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తేనే జనాలు క్యూకడతారు. అందులోనూ పండుగ సీజన్‌లో ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు మరీ ఎగబడతారు. ఒక వేళ నచ్చిన వస్తువులను ఫ్రీ (ఉచితం)గా తీసుకువెళ్లవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇస్తే జనాలు పోటెత్తుతారు. ఉచితం అంటే చాలు ఏ దేశంలోనే అయినా ప్రజలు పోటెత్తడం ఖాయం.

అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగింది. బాక్సింగ్ డే సందర్భంగా ఓ మాల్ యజమాని ఇచ్చిన బంపర్ ఆఫర్‌కు జనాలు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పెర్త్‌కు చెందిన స్ట్రీట్ ఎక్స్ అనే మాల్ యజమాని డేనియల్ బ్రాడ్‌షా తరచు వినూత్న మార్కెటింగ్ చేస్తుంటారు.

ఈ క్రమంలో బాక్సింగ్ డే సందర్భంగా తాను వందలాది మందికి టీషర్టులు గివ్ అవే ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో వందలాది యువకులు మాల్‌లోకి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి అయితే ముందు జాగ్రత్త చర్యగా సైకిల్ హెల్మెట్, ప్యాడ్స్ ధరించి మాల్ లోకి వచ్చాడు.

ఈ గివ్ అవేపై మాల్ యజమాని డేనియల్ బ్రాడ్‌షా మాట్లాడుతూ .. వినియోగదారుల కోసం ఏదైనా సరదాగా చేయాలన్న ఉద్దేశంతో మాల్‌ను పూర్తిగా ఉచితంగా ఉంచినట్లు తెలిపారు. సుమారు 400 వస్తువులు కేవలం 30 సెకనులలో ఖాళీ అయ్యాయని ‌చెప్పాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

అయితే.. కొందరు వ్యక్తులు మాల్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఒకరి చేతుల్లోంచి మరొకరు దుస్తులు లాక్కోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags

Next Story