Steve Jobs: వామ్మో.. పాత చెప్పులకు అంత ధరా.. ఎందుకో అంత డిమాండ్

Steve Jobs: కొంత మంది వ్యక్తులకు పాత వస్తువులను సేకరించడం హాబీ. అది నాణేలు కావచ్చు, పెయింటింగ్ కావచ్చు. ఇక ప్రముఖులకు సంబంధించిన వస్తువులంటే మరింత క్రేజ్. దీన్నే క్యాష్ చేసుకుంటారు సదరు వేలం పాట వ్యక్తులు. తాజాగా స్టీవ్ జాబ్ పాత చెప్పులను వేలంలో ఉంచారు. వేలం నిర్వాహకుడు జూలియన్ ప్రకారం, స్టీవ్ జాబ్స్ ఉపయోగించిన ఒక జత బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులు అమ్మకానికి ఉన్నాయి.
అవి 60వేల డాలర్ల నుంచి 80వేల డాలర్లు పలుకుతున్నాయి. మర కరెన్సీ ప్రకారం రూ. 48,32,889- 64,43,852) మధ్య విక్రయించబడతాయని అంచనా. జూలియన్స్ వేలం యొక్క వెబ్‌సైట్ ప్రకారం, "1970లు మరియు 1980లలో జాబ్స్ ఈ ప్రత్యేకమైన చెప్పులను ధరించేవారు. ఈ చెప్పులు గతంలో స్టీవ్ జాబ్స్ హౌస్ మేనేజర్ మార్క్ షెఫ్ యాజమాన్యంలో ఉన్నాయి. కీలకమైన సమయాల్లో మాత్రమే స్టీవ్ ఈ చెప్పులు ధరించేవారని వెబ్‌సైట్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com