Storm Eunice : యూరప్ దేశాలను వణికిస్తోన్న యునిస్ తుఫాన్.. తొమ్మిది మంది మృతి..!

Storm Eunice : యూరప్ దేశాలను వణికిస్తోన్న యునిస్ తుఫాన్.. తొమ్మిది మంది మృతి..!
Storm Eunice : యునిస్ తుఫాన్.. యూరప్ దేశాలను వణికిస్తోంది. దక్షిణ ఇంగ్లండ్‌, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్, సౌత్‌వేల్స్‌లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

Storm Eunice : యునిస్ తుఫాన్.. యూరప్ దేశాలను వణికిస్తోంది. దక్షిణ ఇంగ్లండ్‌, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్, సౌత్‌వేల్స్‌లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాలు అల్లకల్లోలం అవుతున్నాయి. గంటకు 196 కిలోమీటర్ల వేగంతో ప్రపండ గాలులతో విరుచుకుపడుతోంది. ఇప్పటివరకూ తుఫాను ధాటికి ఇప్పటివరకూ 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

నార్తరన్ యూరోపియన్ దేశాల్లో బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో తుఫాను తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంగ్లండ్‌‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. భీకర గాలులకు బెల్జియంలో ఒక ఆస్పత్రి పైకప్పు పైకి ఎగిరిపోయింది. తుపాను కారణంగా వేలాది మంది నిర్వాసితులుగా మారగా.. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంగా మారింది.

లండన్‌లో రాకాసి గాలుల బీభత్సానికి ఓ మహిళ మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. లివర్‌పూల్‌లో గాలుల ప్రభావానికి శిథిలాలు గాల్లో ఎగిరిపోతున్నాయి. శిథిలాలు బలంగా తాకడంతో వాహనంలో ఉన్న మరో వ్యక్తి మరణించాడు. హాంప్‌షైర్‌లోని దక్షిణ ఇంగ్లీష్ కౌంటీలో పడిపోయిన చెట్టును వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. బ్రిటన్‌లో మరొకరు, నెదర్లాండ్స్‌లో చెట్లు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా మొత్తం 436 విమానాలు రద్దు అయ్యాయి

యూనిస్ తుఫాను నేపథ్యంలో లండన్‌లో రెడ్‌ అలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అటు దక్షిణ ఇంగ్లండ్, సౌత్ వేల్స్, నెదర్లాండ్స్‌లోనూ హైరిస్క్ అలర్ట్ జారీ చేసింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుపాను జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుంచి యూరప్ వైపు దూసుకెళ్తోందని బ్రిటన్ వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story