Donald Trump: ట్రంప్‌తో సంబంధాలు నిజమే

Donald Trump: ట్రంప్‌తో  సంబంధాలు నిజమే
కోర్టు ముందు ట్రంప్‌తో రిలేషన్‌షిప్ గురించి చెప్పిన అడల్ట్ స్టార్‌

‘హష్‌ మనీ’ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌ తగిలింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అతని హోటల్‌ సూట్‌లోని బెడ్‌పై సెక్స్‌లో పాల్గొన్నట్టు అడల్ట్‌ స్టార్‌ స్మార్మీ డేనియల్స్‌ మంగళవారం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్‌ కండోమ్‌ వాడారా? అని అడిగిన ప్రశ్నకు, ‘లేదు’ అని డేనియల్స్‌ సమాధానమిచ్చారు. ట్రంప్‌తో 2006నాటి లైంగిక సంబంధాన్ని కోర్టుకు వివరించారు. ఆమెతో శారీరక సంబంధం 2016 ఎన్నికల ప్రచార సమయంలో బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల్ని ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై కోర్టులో క్రిమినల్‌ నేరారోపణలు నమోదయ్యాయి.

2006 లేక్ తాహో సెలబ్రిటీ గోల్ఫ్ ఔటింగ్‌లో ట్రంప్‌ను తాను మొదటిసారి కలిశానని డేనియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీని తరువాత, ట్రంప్ ఆమెను తన విలాసవంతమైన హోటల్ సూట్‌లో విందుకు ఆహ్వానించారని.. ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. ట్రంప్‌ను కలిసినప్పుడు సిల్క్ పైజామా ధరించి ఉన్నారని డేనియల్స్ తెలిపారు. ఓ మ్యాగజైన్‌తో ట్రంప్ తనను సరదాగా కొట్టారని డేనియల్స్ చెప్పారు. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ఆమె లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDs) కోసం టెస్టులు చేయించుకున్నారా.. అని ట్రంప్ ఆమెను అడిగారని డేనియల్స్ చెప్పారు. స్టార్మీ తన వాంగ్మూలంలో, ట్రంప్‌తో సన్నిహిత సమావేశాన్ని వివరించింది, ట్రంప్ సూట్‌లోకి వచ్చినప్పుడు, ఆమె తన బాక్సర్లు, టీ-షర్ట్‌లో బెడ్‌పై ఉన్నానని చెప్పింది. ట్రంప్ తనతో కండోమ్ లేకుండా సెక్స్ చేశాడని అడల్ట్ స్టార్ తన వాంగ్మూలంలో పేర్కొంది. మరోసారి కలుస్తానని ట్రంప్ హామీ ఇస్తూనే తనకు వీడ్కోలు పలికారని డేనియల్స్ తెలిపారు. 2007 వేసవిలో కలిసి నిద్రించడానికి ట్రంప్ ఆమెను లాస్ ఏంజెల్స్‌కు తిరిగి ఆహ్వానించారని, అయితే ఆ సమయంలో ఆమె రుతుక్రమంలో ఉందని డేనియల్స్ చెప్పారు.

వయోజన సినీ నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదైంది. తనకు, ట్రంప్‌కు లైంగిక సంబంధాలు ఉన్నాయని డేనియల్స్ పేర్కొన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తన లైంగిక సంబంధాన్ని వెల్లడించనందుకు డొనాల్డ్ ట్రంప్ తన లాయర్ ద్వారా డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని ఆరోపించారు. మరోవైపు డేనియల్స్‌తో తనకు సంబంధం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. 45 ఏళ్ల అడల్ట్ ఫిల్మ్ స్టార్ డేనియల్స్ పోర్స్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఆమె చేసిన కృషికి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. ఆమె చేసిన హాలీవుడ్ చిత్రాలలో ది 40-ఇయర్-ఓల్డ్ వర్జిన్, నేక్డ్‌ అప్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story