31 Jan 2023 6:38 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Pakistan: మసీదులో...

Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 72కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పాకిస్థాన్ పెషావర్‌లోని మసీదులో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరిగింది.

Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 72కు చేరిన మృతుల సంఖ్య
X

Pakistan: పాకిస్థాన్ పెషావర్‌లోని మసీదులో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరిగింది. దాదాపు 150మందికి పైగా తీవ్ర గాయాలతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడిలో మంగళవారం మరో తొమ్మిది మృతదేహాలు వెలికితీయడంతో మృతుల సంఖ్య 72కి చేరుకుంది.

మసీదు సెంట్రల్ హాల్‌లో సోమవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రార్ధనా స్థలం పైకప్పు ఉన్నఫళంగా కుప్పకూలిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాలేదని ప్రాణాలతో బయట పడిన వ్యక్తులు వివరిస్తున్నారు. తనను తాను పేల్చివేసుకున్న ఆత్మాహుతి బాంబర్ మొదటి వరుసలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఈ దాడికి తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహించింది.

Next Story