Pakistan: పాకిస్థాన్‌లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బస్సుపై ఆత్మాహుతి దాడి..

Pakistan: పాకిస్థాన్‌లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బస్సుపై ఆత్మాహుతి దాడి..
X
నలుగురు పిల్లలు మృతి, దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలు

పాకిస్థాన్‌లో ఓ స్కూల్‌ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్‌ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్‌ ఇక్బార్‌ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ కారును వాడినట్లు చెబుతున్నారు.

కాగా.. ఈ దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ జాతి బలూచ్ వేర్పాటువాద సంస్థలపై, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలు ఈ ప్రావిన్స్‌లో పౌరులు, భద్రతా దళాలపై తరచుగా దాడి చేస్తున్నాయి. ఈ దాడిపై పాకిస్థాన్ ఇంటీరియర్‌ మంత్రి మొహసీన్‌ నఖ్వీ స్పందించారు. “పిల్లలపై దాడి చేసినవారు రాక్షసులు. “శత్రువు.. అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకుని అతి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. అలాంటి మృగాలపై దయ చూపాల్సిన అవసరం లేదు” అని అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్ర పదజాలంతో ఈ దాడిని ఖండించారు.

Tags

Next Story