Sunita Williams: మార్చిలో భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్‌

Sunita Williams: మార్చిలో భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్‌
X
నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి

నుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు త్వరలో భూమికి చేరనున్నారు. ఆమెతో బాటు అక్కడే ఉన్న బుచ్‌ విల్మోర్‌ కూడా కిందకి రానున్నారు. మార్చి మధ్యలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ వ్యోమనౌకను పంపనుందని మంగళవారం నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్‌ అంతరిక్ష కేంద్రానికి చేరి గత వారానికి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి.

రీ షెడ్యూల్‌ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే మార్చి చివరి వారం లేదా.. ఏప్రిల్‌ మొదటి వారంలో వీరుభూమిపైకి తిరిగి వస్తారని ఇప్పటికే నాసా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను మార్చి 12 నాటికి భూమిపైకి తీసుకొచ్చేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు నాసా వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. అంతరిక్షంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించేందుకు స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ ను ఉపయోగించనున్నట్టు సమాచారం.

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్‌లో బోయింగ్‌ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. జూన్‌ 6న ఇద్దరూ వ్యోమగాములు ఐఎస్ఎస్‌లోకి వెళ్లగా.. అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్‌ లైనర్‌లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఇందు(NASA) కోసం స్పేస్‌ ఎక్స్‌ (SpaceX)తో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు మరోనెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

Tags

Next Story