Sunita Williams: సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ ఉమ్మడి స్పేస్‌వాక్‌

Sunita Williams: సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ ఉమ్మడి స్పేస్‌వాక్‌
X
తొమ్మిదోసారి...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా అస్ట్రోనాట్‌ బుచ్‌ విల్‌మోర్‌ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్‌ చేశారు. ఐఎస్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించారు. ఐఎస్‌ఎస్‌కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. ఇరువురు కలిసి స్పేస్‌వాక్‌ చేయడం ఇదే మొదటిసారి.

వేర్వేరుగా స్పేస్‌వాక్‌ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వారిద్దరూ గత ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎనిమిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే ఉంటున్నారు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్ ను కోరారు. మరోవైపు సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్‌ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్‌ చేశామని, చాలా ఆనందంగా ఉందని విల్‌మోర్‌ చెప్పారు.

Tags

Next Story