Sunita Williams: అంతరిక్షంలో వ్యోమగాములకు 16 సార్లు న్యూఇయర్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర సిబ్బంది అందరూ నూతన సంవత్సర వేడుకలను 16 సార్లు జరుపుకుంటున్నారు. భూ గ్రహం చుట్టూ తిరిగేటప్పుడు వారు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తారు.
అందుకే వారు 16 సార్లు న్యూఇయర్ వేడుకను జరుపుకుంటారు. భూమిపై అన్ని దేశాల ప్రజలు ఒకే ఒక్కసారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే ఐఎస్‌ఎస్‌లోని వారు మాత్రం 16 సార్లు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం విచిత్రంగా అనిపిస్తోంది కదూ.
భూమి చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నప్పుడు, “ఎక్స్‌పెడిషన్ 72” టీమ్.. క్యాలెండర్ 2025కి మారుతున్నప్పుడు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తుంది.
కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇప్పటికే పంపారు. అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ-9 మిషన్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు వస్తారు.
ఐఎస్‌ఎస్ కమాండర్‌గా పనిచేస్తున్న విలియమ్స్ జూన్ 2024 నుంచి స్టేషన్‌లో ఉన్నారు. ఐఎస్‌ఎస్‌కి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే ఉండిపోయారు. క్రూ-9 మిషన్ ద్వారా ఇద్దరు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు నలుగురు (సునీతా, బుచ్ విల్మోర్‌తో కలిపి) భూమి మీదకు వస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com