Professional Baby Namer: సూపర్ ఐడియా.. పేరు పెట్టి లక్షలు సంపాదిస్తూ..

Professional Baby Namer: సూపర్ ఐడియా.. పేరు పెట్టి లక్షలు సంపాదిస్తూ..
Professional Baby Namer: పేరు పెడితే దానికో మీనింగ్ ఉండాలి.. అది అప్పటి వరకు విననిది అయి ఉంటే ఇంకా బెటర్..

Professional Baby Namer: అమ్మమ్మపేరో, తాతయ్య పేరో పెట్టి అయిపోయిందనిపించుకునే ఆషామాషీ వ్యవహారం కాదు ఈ రోజుల్లో పేరు పెట్టడం అంటే.. జాతకాలు, నక్షత్రాలు చూసే పేర్లు పెట్టే రోజులకు కూడా కాలం చెల్లింది.. పేరు పెడితే దానికో మీనింగ్ ఉండాలి.. అది అప్పటి వరకు విననిది అయి ఉంటే ఇంకా బెటర్.. ఈ రోజుల్లో పేరు పెట్టడం ఓ పెద్ద ప్రహసనం.. దాన్నే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది న్యూయార్క్‌కు చెందిన హంఫ్రీ.

తల్లిదండ్రులుగా మీరు తీసుకునే మొదటి నిర్ణయాలలో పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం ఒకటి. ఇప్పుడు దాని గురించి కూడా పెద్దగా ఆలోచించక్కరలేదు.. ఆ పని కూడా డబ్బులు ఇస్తే మరొకరు చేసి పెడతారు.. మీ పని ఈజీగా అయిపోతుంది.. ఛార్జ్ బాగానే అవుతుంది.. అవును మరి ఆమె ఒక ప్రొఫెషనల్ బేబీ నేమర్‌. అందుకే చాలా ఖర్చు అవుతుంది!

న్యూయార్క్‌కు చెందిన 'ప్రొఫెషనల్ బేబీ నేమర్', టేలర్ ఎ. హంఫ్రీ, తమ బిడ్డకు సరైన పేరుని ఎంపిక చేసి పెట్టినందుకు $1,500 (రూ. 1.14 లక్షలు) కంటే ఎక్కువ చెల్లించేవారు కూడా ఉన్నారు.

గత సంవత్సరం, ఆమె వంద మందికి పైగా పిల్లలకు పేర్లు పెట్టింది. ఏదో సరదాగా స్టార్ట్ చేసింది.. ఇప్పుడదే ప్రొఫెషన్ అయింది ఆమెకు. పేరు పెట్టడం కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చాలానే చేస్తుంది. కుటుంబం యొక్క పూర్వీకుల గురించి కనుక్కుంటుంది.. వారి ఇష్టాఇష్టాలు తెలుసుకుంటుంది.. వారు మొదట చూసిన ప్రదేశాల గురించి తెలుసుకుంటుంది.. ఇలా అన్ని విషయాలపై దృష్టి సారించి వారికి మంచి పేరుని సజెస్ట్ చేసి దానికి మీనింగ్ కూడా చెబుతుంది..

ఒకరైతే హంఫ్రీ తమ చిన్నారికి పెట్టిన పేరు నచ్చి $10,000 (రూ. 7.6 లక్షలు) చెల్లించారు. దీంతో తన ఐడియా సక్సెస్ అయిందనుకుంది 33 ఏళ్ల హంఫ్రీ. హంఫ్రీ తన ప్రయాణాన్ని 2015లో ప్రారంభించింది. ఆమె తనకు ఇష్టమైన పిల్లల పేర్లను, వాటి అర్థాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో హంఫ్రీ కొత్త కొత్త పేర్లు పోస్ట్ చేయడం చూసి వాటిని తమ పిల్లలకు పెట్టుకున్నామని చెప్పేవారు ఆమె యూట్యూబ్ ఫాలోవర్స్.. దీంతో 2018 లో "వాట్స్ ఇన్ ఏ బేబీ నేమ్" అని వెబ్ సైట్ ప్రారంభించింది హంఫ్రీ. పిల్లలకు పేర్లు పెడుతూ లక్షలు సంపాదిస్తోంది.. ఆలోచనలే పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తోంది.. రెండు చేతులా సంపాదిస్తోంది. మీక్కూడా ఇలాంటి ఐడియాలు వస్తే ఆలస్యం చేయకండి.. స్టార్ట్ టుడే..

Tags

Read MoreRead Less
Next Story