Susan Kehoe: మిస్టర్ ఎలుగుబంటి.. బుద్ధిగా చెప్పిన మాట వింటుంది..

Susan Kehoe: అసలు అడవిలోని క్రూర మృగాలు మనుషుల మాట వింటాయా..? అందులో సందేహం ఏముంది అస్సలు వినవు అనుకుంటున్నారా.. అవును.. ఈ క్రూర మృగాలకు మరొక జీవిపై దాడి చేసే అలవాటు మాత్రమే ఉంటుంది. సాధు జంతువులలాగా చెప్పిన మాట వినే అలవాటు ఉండదు. కానీ ఈ జంతువు మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా చెప్పిన మాట వినడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
అమెరికాలో ఉండే సుసేన్ కెహోయ్‌కు జంతువులంటే చాలా ఇష్టం. ఎలుగుబంట్ల సంరక్షణ కోసం తాను కృషి చేస్తుంది. అందుకేనేమో తన ఇంటి వరు వచ్చిన ఎలుగుబంటి తనను ఏం చేయకుండా చెప్పిన మాట విని వెనక్కి వెళ్లిపోయింది. ఈ సంఘటనను అంతా తన ఫోన్‌లో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది సుసేన్.
మామూలుగా తలుపు తీసిన సుసేన్‌కు తన ఇంటి మెట్ల మీద ఓ ఎలుగుబంటి కనిపించింది. అది చూసి భయపడకుండా తాను మెల్లగా వెనక్కి వెళుతూ మిస్టర్ బియర్ తలుపు వేస్తావా అని అడిగింది. అంతే.. ఆ ఎలుగుబంటి ముందుకొచ్చి తలుపు గడియను తన నోటితో పట్టుకుని మూసేసి వెళ్లిపోయింది. ఇదంతా వీడియో తీసి.. చివర్లో ఎలుగుబంట్లు చాలా మంచివి అని చెప్పుకొచ్చింది సుసేన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com